అంగరంగ వైభవంగా 6టీవీ బతుకమ్మ సాంగ్
తెలంగాణలో అత్యధికంగా, అట్టహాసంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఈ పండుగ ప్రజలకే కాదు ఎంతో మంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి, మీడియా వారికి సంబురాలు తెస్తుంది. అందుకే బతుకమ్మ పండుగ వస్తోంది అంటే తమ సృజనాత్మకతకు మెరుగులు దిద్ది ప్రజలందరినీ అలరించేందుకు సిద్ధమైపోతారు. ఈ విషయంలో ముందువరుసలో ఉంటుంది 6టీవీ. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా తనదైన శైలిలో 6టీవీ బతుకమ్మ సాంగ్ ను మీ ముందుకు తీసుకువచ్చింది 6 టీవీ టీమ్. 6టీవీ ఛైర్మన్ సురేష్ రెడ్డి యేలేటి సమర్పణలో చందు తూటి దర్శకత్వంలో చరణ్ అర్జున్ రచించి, స్వరపరిచిన పాటను తెలుగు ప్రజలకు అందిస్తోంది. వాణి కిశోర్ వొల్లాల, చరణ్ అర్జున్ గాత్రానికి అశోగ్ భోగె కొరియోగ్రఫీ తోడై కలర్ ఫుల్ గా రూపుదిద్దుకుంది. ఇక ప్రణయ్ వొల్లాల సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పాటను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. కొల్వాయి, రాజారం, తిమ్మాపూర్, బీర్పూర్ గ్రామ ప్రజల సహకారంతో అక్కడి అందాలను కలుపుకుని కలర్ ఫుల్ గా తయారయ్యింది.
ఇప్పటికే రిలీజైన ప్రోమో యూట్యూబ్ ట్రెండింగ్ లో స్థానం సంపాదించింది అంటే అర్థం చేసుకోవచ్చు 6టీవీ బతుకమ్మ సాంగ్ అంటే ఎంత క్రేజో.. గతంలో 6టీవీ నిర్మించిన ప్రతి పాట లక్షల వ్యూస్ తో యూట్యూబ్ లో తనదైన ముద్ర వేసుకున్నాయి. ఇక 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు తెలుగు ప్రజల ముందుకు రానున్న ఈ ఏడాది పాట ఎలాంటి రికార్గ్స్ ని బ్రేక్ చేస్తుందో చూడాలి.