స్వస్థలాలకు చేరిన అమర జవాన్ భౌతికకాయాలు!

Spread the love
  • గుంటూరు జిల్లా సత్తెనపల్లికి మురళీకృష్ణ పార్థీవదేహం
  • గుడిపూడిలో ప్రారంభమైన అంత్యక్రియలు
  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
  • గుడిపూడికి చేరుకున్న మురళీ కృష్ణ బంధువులు, స్థానికులు
  • ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన కోబ్రా బెటాలియన్ చెందిన మురళీకృష్ణ

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చేరుకున్న మురళీకృష్ణ పార్థీవదేహానికి కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సత్తెనపల్లికి సమీపంలో ఉన్న గుడిపూడిలో పోలీసు అధికారులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు, మురళీ కృష్ణ బంధువులు, స్థానికులు సత్తెనపల్లికి చేరుకున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాను మురళీకృష్ణ పార్థీవ దేహానికి గ్రామస్థులు నివాళులు అర్పించారు. గుడిపూడికి భారీగా జిల్లా వాసులు తరలివచ్చారు. పూల మాలలలో నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *