మారుతీ రావు ఆస్తులు ఇన్ని కోట్లా…?

Spread the love

మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసు లో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆస్తుల వివరాలను మంగళవారం పోలీపులు కోర్టుకు సమర్పించారు. కాగా ఆదివారం హైదరాబాద్‌లో ఆర్యవైశ్య భవన్‌లో ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రోజున మిర్యాలగూడలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయగా.. ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు బయటకు పడ్డాయి.

బహిరంగ మార్కెట్‌ విలువ ప్రకారం.. మారుతీరావు ఆస్తులు రూ. 200 కోట్లు ఉంటాయని వెల్లడించారు. మొదట కిరోసిన్‌ వ్యాపారం చేసిన మారుతీరావు.. ఆ తర్వాత రైస్‌ మిల్లుల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. 15 ఏళ్ల క్రితం రైస్‌ మిల్లులను అమ్మి రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో గ్రీన్‌హోమ్స్‌ పేరుతో 100 విల్లాలను అమ్మాడు. ఇక మిర్యాలగూడలో కూతురు అమృత పేరిటా 100 పడకల ఆసుపత్రిని నిర్మించారు. ఆయన భార్య గిరిజా పేరు మీద 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. :

అంతేగాక మిర్యాలగూడ బైపాస్‌లో 22 గుంటల భూమి, హైదరాబాద్‌ కొత్తపేటలో 400 గజాల స్థలం, ఈదులగూడ ఎక్స్‌రోడ్‌లో షాపింగ్‌ మాల్స్‌తో పాటు ఆయన తల్లి పేరు మీద రెండతస్తుల షాపింగ్‌మాల్‌ కూడా ఉంది. దామరచర్ల శాంతినగర్‌లో 20 ఎకరాల పట్టా భూమి, ఆయన పేరు మీద సొంతంగా 6 ఎకరాల భూమితో పాటు, సర్వే నెం 756తో మిర్యాలగూడలో ఎకరం 2గుంటల భూమి ఉంది. ఇక హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 5 అపార్టుమెంట్లు ఉన్నట్లు పోలీసులు కోర్టుకు వివరాలు సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *