మస్కా కొట్టి పెళ్లి పీటలెక్కేసిన బన్నీ హీరోయిన్

Spread the love

అల్లు అర్జున్ తో చేసిన పరుగు, తారక్ తో కలసి అదుర్స్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న భామ షీలా షింగ్. ఆ తరువాత కొన్ని చిన్నా చితకా సినిమాల్లో నటించినా కూడా పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో చేసేది ఏమీ లేక, అవకాశాలు కోసం ఎదురు చూస్తూ 5 ఏళ్ళ పాటు టైం వేస్ట్ చేసిన ఈ అమ్మడు ఎట్టకేలకు వైవాహిక జీవితంలోకి ఎంటరయ్యింది.

తెలుగు.. తమిళం.. కన్నడం భాషల్లో మొత్తంగా 24 చిత్రాలు చేసిన షీలా..సంతోష్ రెడ్డితో చెన్నైలో వైభవంగా వివాహం చేసుకుంది. సినిమా పరిశ్రమకు చెందిన వారు ఎవరు కూడా ఈ వేడుకలో పాల్గొనలేదు. ఇద్దరి బంధువులు మిత్రులు ఆప్తులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరైనట్లుగా సమాచారం. సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయిన కారణంగా షీలా ఇండస్ట్రీ వారిని ఎవరు పిలవలేదని తెలుస్తోంది.

తెలుగులో ఈ అమ్మడు అల్లు అర్జున్ తో పరుగు.. ఎన్టీఆర్ తో అదుర్స్.. రామ్ తో మస్కా.. బాలయ్యతో పరమవీర చక్ర చిత్రాలతో పాటు ఇంకా పలు చిన్నా పెద్ద చిత్రాల్లో నటించింది. తెలుగులో పెద్ద హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నా కూడా ఈ అమ్మడికి లక్ మాత్రం కలిసి రాలేదు. దీంతో ఈమె కెరీర్ తక్కువ సమయంకే ముగిసింది.
-కె. మమత

For more news :

Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *