బిగ్ బాస్ 4 కి హోస్ట్ ని ఫిక్స్ చేశారా?
బిగ్ బాస్ 4 ను స్టార్ట్ చెయ్యడానికి ఇప్పటికే నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో సీజన్ 4 కు ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారనే విషయంలో సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటి సీజన్ లో ఎన్టీఆర్.. రెండవ సీజన్లో నాని.. మూడవ సీజన్లో నాగార్జున హోస్టులుగా వ్యవహరించారు. అయితే ఈసారి నాలుగవ సీజన్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ గాలి వార్తలే అని తేల్చేశాయి మహేష్ సన్నిహిత వర్గాలు.
దీంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇలాంటి సమయంలో మహేష్ హోస్ట్ గా చేయడం రిస్క్ అనేది ఎక్కువ మంది అభిమానుల అభిప్రాయం. దానికి కారణం గతంలో హోస్ట్ గా చేసిన వారిలో తారక్ తప్ప, నాని, నాగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడమే. మహేష్ రిజర్వుడుగా ఉండే వ్యక్తి కావడంతో ఇలాంటి షోలకు న్యాయం చేయలేననే అభిప్రాయం ఉందట. అంతే కాకుండా మహేష్ బాబును బిగ్ బాస్ నిర్వాహకులు ఇంతవరకూ సంప్రదించలేదని అంటున్నారు.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ 4 వ సీజన్ కు అక్కినేని నాగార్జునను హోస్ట్ గా కొనసాగించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే నాగార్జున మూడవ సీజన్ కు హోస్టుగా వ్యవహరించారు కాబట్టి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని భావిస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
-కె. మమత
For more news :
Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter