పొత్తూరి మరణం పత్రికా రంగానికి తీరని లోటు: పవన్

Spread the love

తెలుగు పాత్రికేయ రంగంలో శిఖర సమానులైన పొత్తూరి వెంకటేశ్వరరావు మరణం పాత్రికే లోకానికి తీరని లోటు అని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. పొత్తూరి మృతి పట్ల పవన్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు పత్రికా రంగానికి పొత్తూరి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా విశిష్ట సేవలందించాని గుర్తుచేశారు. వర్ధమాన పాత్రికేయులకు పొత్తూరి శైలి మార్గదర్శకం అని తెలిపారు. పొత్తూరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *