చైనీయులు చేసిన పనికి దేశ దేశాలు అభినందిస్తున్నాయి.
ఆమధ్య కాలంలో ఒకసారి నడి రోడ్డు పై ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న లారీకి ప్రమాదం జరిగినప్పుడు జనాలు ఎగబడి ఉల్లిపాయలను దోచుకెళ్లారు.అలానే డీజిల్ ట్యాంకర్ ప్రమాదం జరిగినప్పుడు కూడా ఎంచక్కా డీజిల్ క్యాన్లలో తీసుకెళ్లారు. కానీ, ఓచోట మాత్రం రోడ్డు మీద యాపిల్ పళ్లు పడిపోతే. ఎవరు కూడా తేరగా దొరికాయని దోచుకోలేదు. అలాగని మనకెందుకులే అని పట్టించుకోకుండా ఉండలేకపోయారు. వెళ్లి ఆ యాపిల్ పళ్లను బాక్సుల్లో ఎత్తి ప్రమాదం జరిగిన సైకిల్ మీద పెట్టి సాయంచేసారు.
ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ కరోనా వైరస్ భయంతో జనాలు చేతులు కలుపుకోవడాలు, సాన్నిహిత్యంగా మాట్లాడుకోవడాలు, ఒకరికొకరు సహాయం చేసుకోవడాలన్నీ మానుకున్నారు. ఎవరి మట్టుకు వారు ఉంటున్నారు. తగులుకుంటే కరోనా అంటుకుంటుందని ఎవరి భయాల్లో వారు ఉంటున్న పరిస్థితి.
ఇలాంటి సమయంలో రోడ్డుపై పడిపోయిన యాపిల్స్‌ను అందరు సమిష్టిగా తొలగించి చైనీయులు తమ మానవత హృదయాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది జనాలను ఆకట్టుకుంటుంది. చైనాలోని బోజౌలో రద్దీగా ఉండే ఓ కూడలి వద్ద ట్రైసైకిల్ కారుకు తగలడంతో అందులోని యాపిల్స్ రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. ఓ మనిషి కూడా రోడ్డు మీద పడిపోయాడు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ యాపిల్స్ వ్యక్తి ఇంక తనకు సాయం చేయడానికి ఎవరూ రారని భావించాడు. రోడ్డు పాలైన యాపిల్స్‌ను చూసి నష్టం తప్పదని బాధపడుతుండగా అతనికి చైనీయులు షాక్ ఇచ్చారు.
కొద్ది క్షణాల్లోనే అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు మానవత హృదయంతో స్పందించారు. కరోనా గిరోనా జాన్తానై అంటూ సాయం చేయడానికి ముందుకొచ్చారు. దాదాపు 20 మంది కలిసి కేవలం నాలుగు నిమిషాల్లోనే రోడ్డుపై పడిపోయిన యాపిల్స్‌ను ఏరి బాక్స్‌ల్లో పెట్టారు. ఆ తర్వాత యాపిల్ బాక్సులను ట్రైసైకిల్‌లో ఎక్కించి పంపించారు. ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
For more news :
Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter