కరోనా వైరస్ ( కోవిడ్-2019) రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!
ఇండియాలో కరోనా వైరస్ ముగ్గురికే ఉందనీ, ఆ ముగ్గురూ కూడా రికవరీ అవుతున్నారని ధైర్యంగా ఉన్నాం అనుకునేలోపే .. పిడుగులాంటి వార్త.. ఇప్పుడో… 3 కాస్తా 6 అయ్యింది. కొత్తగా వైరస్ సోకిన వారిలో ఒకరు ఢిల్లీలో మరొకరు జైపూర్‌లో (రాజస్థాన్) ఉండగా… ఇంకొకరు తెలంగాణలో ఉన్నారు కాబట్టి… తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు హైఅలర్ట్‌లో కొనసాగుతోంది. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి.. మనం ఇప్పటిదాకా ఎండ వల్ల మన దేశంలో కరోనా వైరస్ రావట్లేదని అనుకున్నాం కదా.. అది నిజం కాదంటున్నారు డాక్టర్లు.
సౌదీ అరేబియా లాంటి దేశంలో కూడా కరోనా వచ్చింది. అక్కడ విపరీతమైన ఎండలుంటాయి. ఇండియాలో కూడా బయటి దేశాల నుంచీ వచ్చే వారికి కరోనా వస్తోంది. అలా వచ్చిన వారి నుంచీ ఇతరులకు అది వ్యాపించి… ఇండియాలోనూ ఎండలు వున్నా… కరోనా వ్యాధి సోకే ప్రమాదం ఉంది. కాబట్టి… ఇప్పుడు మనం ఎంత జాగ్రత్త పడితే… అంతలా ఈ వ్యాధిపై పోరాటంలో గెలవగలం అన్నది డాక్టర్ల చెప్పే మంచి మాట.
కరోనా వైరస్ ఎలా వస్తుందో తెలిస్తే… అది మనకు చేరకుండా మనం జాగ్రత్త పడగలం సులువు అవుతుంది . ఇది గాలి ద్వారా వచ్చే వైరస్ కాదు. అంటే… గుంపుగా జనం ఉన్నా… అక్కడి గాలిలో కరోనా వైరస్ ఉండదు. కానీ… ఆ జనంలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే… వాళ్లు దగ్గినా, తుమ్మినా… అప్పుడు వచ్చే నీటి బిందువుల్లో కరోనా వైరస్ ఉంటుంది అనేది విశ్లేషకుల మాట. అది గాలిలో ఎగురుతూ వచ్చి మనపై పడితే… వైరస్ మనపై చేరే ప్రమాదం ఉంటుందని డాక్టర్ల మాట.. వైరస్ మనకు చేరకుండా ఉండాలంటే… మనపై ఏ తుంపర్లూ పడకూడదన్నమాట. అందుకు తగిన జాగ్రత్తలు తిరుకోవాలి..
వైరస్ ఉన్న వ్యక్తులు ప్రయాణాల్లో బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో, ఆటోల్లో ఎక్కడైనా సరే, ఏదైనా వస్తువును (రాడ్లు, సీట్లు, డోర్లు వంటివి) ముట్టుకుంటే… వాటిపై వైరస్ ఉండే ఛాన్సుంటుంది. అదే వస్తువును మనమూ ముట్టుకుంటే… ఆ వైరస్ మనపై చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి… వీలైనంతవరకూ అలాంటివేవీ ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. చేతులకు గ్లోవ్స్ వాడితే మంచిది..వైరస్ ఉన్నవారికి మనం కనీసం 2 మీటర్ల దూరంలో ఉండేలా చూసుకోవాలి. అలానే ఎవరికి వైరస్ సోకిందో మనకు తెలియదు కదా. కాబట్టి… మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే మనం పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గింజల వంటివి ఎక్కువగా తినాలి. ముఖ్యంగా పుల్లటి పండ్లను బాగా తినాలి. వాటిలోని C విటమిన్… ఇలాంటి వైరస్‌లను బాడీలోకి రానివ్వకుండా చేస్తుంది.
ఫుల్ ఆరోగ్యంతో ఉండేవారి కంటే… జలుబు, దగ్గు, నీరసం, ఆయాసం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్ వెంటనే సోకుతోంది. అనారోగ్యాలు ఉన్నవారు మరింత ఎక్కువ జాగ్రత్త పడాలి అని డాక్టర్ సూచిస్తున్నారు. బయటి ప్రయాణాలు మానుకుంటే ప్రస్తుతత పరిస్థితిల్లో చాల మంచిది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ సోకితే… భయపడాల్సిన అవసరం లేదు . మనం ధైర్యంగా ఉండాలి … కచ్చితంగా రికవరీ అవుతామనే ధైర్యంగా ఉండాలి.
For more news :
Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter