”ఆచార్య”పై అంచనాలు పెంచేసిన కాజల్ కామెంట్స్..

Spread the love

ఇప్పటివరకు అసలు అపజయం అంటూ ఎరుగని దర్శకుడు కొరటాల శివ. మెగాస్టార్ తో కలసి చేస్తున్న మొదటి సినిమా ఆచార్యపై మామూలుగానే అంచనాలు ఉండటం కామన్. దానికి తోడు గెస్ట్ రోల్ లో చరణ్-పూజా హెగ్డే కనిపించనున్నారు అని తెలియగానే సినిమాపై హైప్ ఓ రేంజ్ కి వెళ్ళిపోయింది. అవి సరిపోవు అన్నట్టు తాజాగా మోసగాళ్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆచార్య హీరోయిన్ కాజల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ ఆమె ఏం అన్నదంటే…

సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ డ్రామా అని, చిరంజీవి గారు అభిమానులను గతంలో ఎప్పుడు లేని విధంగా అలరిస్తారని చెప్పుకొచ్చింది. ఇక చిరంజీవి గారు మరియు చరణ్ ల కాంబో సీన్స్ అద్బుతంగా ఉంటాయని, చిరంజీవి గారిని ఒక కొత్త పద్దతిలో అభిమానులకు నచ్చే విధంగా మాస్ లుక్ లో దర్శకులు కొరటాల శివ చూపించబోతున్నారు. తప్పకుండా ఆచార్య రాకింగ్ గా ఉంటుందని కాజల్ చెప్పుకొచ్చింది. కాజల్ ఇలా చెప్పింది అంటే ఆ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పటికే ఊహించుకున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఈ సినిమా  మే 13న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

-మమత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *