అనుష్క ఎంత మంచి పని చేసిందో తెలుసా..?

Spread the love

మొన్నటివరకు తెలుగులో నంబర్ వన్ స్థానంలో వెలిగిన అనుష్క, ఈ మధ్య మాత్రం తన జోరు తగ్గించింది. ప్రసుతం నిశ్శబ్దం అనే సినిమా నటిస్తోంది జేజమ్మ. అనుష్క ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అయిన సంధర్బంగా చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అనుష్క గురించి ఎవరికీ తెలియని ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఓ సినిమా షూటింగ్ కోసం కొన్ని నెల‌ల క్రితం నేను జార్జియా వెళ్లా. అక్క‌డ నాకు జాజా అనే వ్యక్తిని సహాయకుడిగా నియ‌మించారు. నేను హైద‌రాబాద్ నుంచి వ‌చ్చానని తెలుసుకుని అత‌ను అనుష్క తెలుసా అని అడిగాడు. అంతే కాదు అనుష్క తనకు ఎంత సహాయం చేసిందో చెప్పాడు. ఓ సినిమా షూటింగ్‌ కోసం అనుష్క జార్జియా వెళ్లిన‌ప్ప‌డు ఆమెకు జాజా కారు డ్రైవ‌ర్‌గా ఉన్నాడ‌ట‌. అయితే ఒక‌రోజు జాజాకు బ‌దులుగా మ‌రో వ్య‌క్తి డ్రైవర్‌గా వచ్చాడట‌.

దీంతో జాజా ఎందుకు రాలేదు అని సదరు డ్రైవర్ ను అడిగితే.. అతని కారును ఫైనాన్ష్ వాళ్లు తీసుకెళ్లార‌ని చెప్పార‌ట‌. అనుష్క వెంట‌నే జాజాకు ఓ కొత్త కారు కొనిచ్చింద‌ట‌. సంబంధం లేని వ్యక్తి కోసం ఇలా ఎవరు చేస్తారు అంటూ చెప్పి స్వీటీ మంచి తనాన్ని మెచ్చుకునాన్డు శ్యాంప్ర‌సాద్‌రెడ్డి అన్నారు.
-కె. మమత

For more news :

Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *